విషాదంలోనూ మానవత్వం.. నేత్రదానానికి కుటుంబం నిర్ణయం
నవపక్షం, నల్లగొండ రూరల్ ప్రతినిధి : నల్గొండ మండలం, రసూల్‌పూర్: రసూల్‌పూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తీగల అమృత శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆమె ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ విషాద సమయంలోనూ అమృత కుటుంబ సభ్యులు తీసుకున్న మానవతా నిర్ణయం పలువురి ప్రశంసలు అందుకుంది. ఆమె నేత్రాలను దానం చేసి, రెండు కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపేందుకు కుటుంబ సభ్యులు...