దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించిన పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వర్తిస్తుందని తీర్పు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్ ఎన్నికయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ...