ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించాలి – రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు
నవపక్షం, బాన్సువాడ ప్రతినిధి : వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు కోరారు. వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం నిర్వహించనున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి బాన్సువాడ పట్టణంలో పాత బాన్సువాడ చావిడి నుంచి కల్కి చెరువు వరకు నిమజ్జన రూట్‌ను జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి కాసుల బాలరాజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన రూట్‌లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన...