నూతన సింగిల్ విండో చైర్మన్ మస్తాన్ బాబు, పాలకవర్గ సభ్యులకు అభినందనలు

నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 19: మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో నూతనంగా సింగిల్ విండో చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన ఈడుదుల మస్తాన్ బాబు, నూతన పాలకవర్గ సభ్యులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో నూతన పాలకవర్గం రైతులకు, ప్రజలకు నిస్వార్థ సేవలు అందించాలని ఆకాంక్షించారు....