పద్మనగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి అన్నప్రసాద వితరణ

నవపక్షం, నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ పట్టణంలోని పద్మనగర్ కాలనీలో కర్నాటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్లగొండ డీఎస్పీ గౌరవనీయులు శివరామిరెడ్డి హాజరై గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరామిరెడ్డి మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఉత్సవాల...