అందర్ 14 జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన కేజీబీవీ విద్యార్థిని సుప్రియ

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి :  మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో 9వ తరగతి చదువుతున్న అడ్లూరు గ్రామానికి చెందిన వానరాశి సుప్రియ అండర్-14 జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది. చిన్న వయసులోనే క్రీడలపై ఆసక్తి పెంచుకుని కబడ్డీలో ప్రతిభ కనబరుస్తున్న సుప్రియ, నియోజకవర్గ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, కేజీబీవీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 18, 19 తేదీల్లో...