గణపతి నవరాత్రి సందర్భంగా కొండభీమనపల్లి శివాలయంలో ఘనంగా అన్నదానం
నవపక్షం, దేవరకొండ మండల ప్రతినిధి : దేవరకొండ మండలం: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొండభీమనపల్లి గ్రామంలోని శ్రీ శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తులకు అన్నప్రసాదం అందించిన దాతలు, నిర్వాహకులను గ్రామస్థులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...