చౌటుప్పల్ మున్సిపాలిటీలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 19: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డులోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ సూచించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కౌన్సిలర్ వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. రాంనగర్, వినాయక నగర్, జయభూమి వెంచర్, వెంకటరమణ కాలనీల్లో పర్యటించి వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు సాఫీగా వెళ్లేందుకు అడ్డుగా...