వినాయకుడిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న రాచకొండ జానకిరాములు గౌడ్
నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి : కేతేపల్లి మండలం గుడివాడ గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాచకొండ జానకిరాములు గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, గ్రామ ప్రజలతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాచకొండ జానకిరాములు గౌడ్ పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం ప్రజలందరికీ శుభాలను,...