నిరుద్యోగులకు సువర్ణ అవకాశం.. ఎల్విన్ ఎనర్జీ సోలార్‌లో రీజినల్ మేనేజర్ పోస్టులకు నియామకాలు
నవపక్షం, భీమవరం ప్రతినిధి : సౌర విద్యుత్ రంగంలో విస్తరిస్తున్న ఎల్విన్ ఎనర్జీ సోలార్ సంస్థలో రీజినల్ మేనేజర్ పోస్టులకు నియామకాలు చేపడుతున్నట్లు సంస్థ ప్రతినిధి రవి ప్రకాష్ తెలిపారు. సంస్థ కార్యకలాపాల విస్తరణలో భాగంగా భీమవరం, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హత కలిగిన గృహాలకు ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ సదుపాయాలను చేరువ చేయడంలో భాగంగా సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని రవి...