మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని మొయినాబాద్‌లో ఘనంగా రక్తదాన శిబిరం

నవపక్షం, మొయినాబాద్ మండల ప్రతినిధి :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ప్రజా జీవితంలో ఆయన 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొయినాబాద్ మండలంలోని జేపీఎల్ కన్వెన్షన్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డిగూడెం గ్రామ బీజేపీ అధ్యక్షుడు, రెండో వార్డు సభ్యుడు భవాని అనిల్ కుమార్ రక్తదానం చేశారు. ఆయనతో పాటు కే. ప్రవీణ్, సీహెచ్. శివ, సాయి, ముదిరాజ్ చరణ్...