జనసంద్రంగా మారిన బొప్పారం.. కేశయ్యకు కన్నీటి వీడ్కోలు

నవపక్షం, కేతేపల్లి: మండలంలోని బొప్పారం గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుంకరి కేశయ్య అంతిమయాత్ర తీవ్ర విషాదం, భావోద్వేగాల మధ్య కొనసాగింది. కేశయ్య మృతితో బొప్పారం గ్రామం విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొని తమ అభిమాన నాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నేనున్నానంటూ అండగా నిలిచే కేశయ్య ఇక లేరనే విషయం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. గ్రామ...