గాంధీనగర్ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జన మహోత్సవం
నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి : గాంధీనగర్ కాలనీ చెంగిచర్లలో ఉమేశ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ప్రత్యేక అతిథిగా కొత్త సుశాంత్ గౌడ్ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై, యువతను ప్రోత్సహిస్తూ వినాయక నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త సుశాంత్ గౌడ్ మాట్లాడుతూ గాంధీనగర్ కాలనీ ప్రజల ఐక్యత, యువత చూపుతున్న ఉత్సాహం అభినందనీయమన్నారు. ప్రజల...