హ్యూమన్ రైట్స్ కమిటీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన అధ్యక్షుడిగా కాడవేన రాకేష్
నవపక్షం, భూపాలపల్లి, సెప్టెంబర్ 20: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా జయశంకర్ భూపాలపల్లి జిల్లా యువజన అధ్యక్షుడిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న కాడవేన రాకేష్ నియమితులయ్యారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ, సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్న రాకేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ కార్యక్రమాలకు యువతను మరింతగా భాగస్వామ్యం చేయాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ...