ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, ఖమ్మం జిల్లా ప్రతినిధి : ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజండ్ల సాయికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి ఖాలీద్ అహ్మద్, జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షుడు నాగెండ్ల దీపక్ చౌదరి, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జి వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి...