బచ్చన్నపేటలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అల్వాల నర్సింగరావు

నవపక్షం, బచ్చన్నపేట మండల ప్రతినిధి : బచ్చన్నపేట చౌరస్తాలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీకాంత్‌తో కలిసి ఆయన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అల్వాల నర్సింగరావు మాట్లాడుతూ వినాయకుడి ఆశీస్సులతో బచ్చన్నపేట గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన...