గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు

నవపక్షం, చండూరు మండల ప్రతినిధి : చండూరు మండలం పుల్లెంల గ్రామంలోని శివాజీ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉత్సవాల్లో భాగంగా బీజేపీ నాయకులు నకిరేకంటి శ్యామల–లింగస్వామి దంపతులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి స్వామివారికి పుష్పాలతో అలంకరణ చేసి, భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కాలనీ ప్రజలు, భక్తులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నకిరేకంటి శ్యామల–లింగస్వామి...