చెంగిచర్ల గాంధీనగర్ కాలనీలో ఘనంగా శ్రీ వినాయక స్వామి అన్నదాన కార్యక్రమం

నవపక్షం, చెంగిచర్ల ప్రతినిధి :  చెంగిచర్ల గాంధీనగర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక స్వామి అన్నదాన కార్యక్రమానికి మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ విచ్చేసి భక్తులతో ఆత్మీయంగా మమేకమయ్యారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. వినాయక స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తి, సేవ, మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఈ సందర్భంగా అభినందించారు.