నల్గొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం
నవపక్షం, నల్గొండ జిల్లా ప్రతినిధి : బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా నల్గొండలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమయ్యే వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా యువతలో సేవా భావాన్ని,...