ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

నవపక్షం, హైదరాబాద్: ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా షాపూర్ నగర్ డివిజన్, న్యూ ఎల్‌బీ నగర్‌లోని శారదా విద్యా భవన్ హై స్కూల్‌లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ డైరెక్టర్ మధుబాబు చికిలే మాట్లాడుతూ, అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. యుద్ధాలు, హింస, విద్వేషాలు పెరుగుతున్న నేటి ప్రపంచంలో శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవడం మాత్రమే కాదని, న్యాయం, సమానత్వం, మానవ గౌరవం, పరస్పర విశ్వాసం, సహజీవనానికి శాంతి పునాది...