డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణకు డిమాండ్… తహసీల్దార్‌కు తక్కెళ్లపహాడ్ గ్రామస్థుల వినతిపత్రం
నవపక్షం, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం తక్కెళ్లపహాడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుతో పాటు గతంలో తమకు కేటాయించిన ప్లాట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్థులు శాలిగౌరారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం 2003–04 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామంలోని నిరుపేదలకు ఒక్కొక్కరికి 150 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం 2013 నుంచి 2017 వరకు సర్పంచ్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ పథకం...