ధర్మపురి కాలనీ సాయిబాబా ఆలయంలో రెండు లడ్డూలను దక్కించుకున్న మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్
నవపక్షం, ఉప్పల్ ప్రతినిధి: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీరప్పగడ్డ డివిజన్ పరిధిలోని ధర్మపురి కాలనీ శిరిడీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన లడ్డూ వేలం పాట, లక్కీ డ్రాలో చిల్కానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ దంపతులకు ఒకేసారి రెండు లడ్డూలు దక్కాయి. నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న 10 కిలోల లడ్డూను నిర్వహించిన వేలం పాటలో రూ.1,05,000లకు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ దక్కించుకున్నారు. అదే సమయంలో ఆలయ కమిటీ నిర్వహించిన రూ.51...