గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్

నవపక్షం, తుంగతుర్తి: శ్రీశ్రీశ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో జాంబవంత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహాన్ని తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు డా. గాదరి కిశోర్ కుమార్ గారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. అనంతరం గణనాథుని ఆశీస్సులతో తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో...