దుబ్బాకలో ఘనంగా వినాయక ఉత్సవాలు

  నవపక్షం, దుబ్బాక: దుబ్బాకలో కత్తి కార్తీక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుడిని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్ కళ్యాణి యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కత్తి కార్తీకతో కలిసి నిత్య అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని కత్తి కార్తీక ఆధ్వర్యంలో భక్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని కళ్యాణి యాదవ్ అన్నారు. ఆధ్యాత్మిక...