కోట ఎక్సలెన్స్ సెంటర్‌లో విద్యార్థుల భద్రత, వసతులపై తల్లిదండ్రుల ఆందోళన

నవపక్షం , కోట ప్రతినిధి : విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కోట సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌పై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా విద్యార్థుల వసతి, స్నానపు గదులు, పారిశుధ్యం, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల భద్రతపై స్పష్టమైన భరోసా లేకుండా హాస్టల్‌లో ఎలా ఉంచాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి ఎంతో ఆశతో పిల్లలను కోటకు పంపించామని, అయితే ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను...