శాంతిలో పెట్టుబడే సుస్థిర భారతానికి బలమైన పునాది: మధుబాబు చికిలే
నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా శాంతి, సామాజిక న్యాయం, మానవ హక్కులు, విద్య, సమానత్వం, సుస్థిర అభివృద్ధి పరస్పరం విడదీయరాని అంశాలని స్కిలోక్రాట్, నేషనల్ డైరెక్టర్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మధుబాబు చికిలే పేర్కొన్నారు. శాంతి అనేది కేవలం యుద్ధం లేని పరిస్థితి కాదని, సమాజ అభివృద్ధికి, మానవ హక్కుల పరిరక్షణకు, సుస్థిర భవిష్యత్తుకు అవసరమైన పునాది అని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి గుర్తించిన...