రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం

నవపక్షం, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :  రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి అధ్యక్షతన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జ్ ఖాలీద్, సహాయ ఇంచార్జ్ భవ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, సంస్థాగతంగా యువజన...