కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాలను తిరిగి ప్రారంభించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను వేరే చోటుకు తరలించాలి: బహుజన యూత్ ఫోర్స్ డిమాండ్

నవపక్షం, కోట ప్రతినిధి : కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాలను తిరిగి ప్రారంభించడంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)ను వేరే ప్రాంతానికి తరలించి విద్యార్థులకు న్యాయం చేయాలని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండు నెలలుగా కోట అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేత చర్యను నిరసిస్తూ తాము వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాకపోవడంపై బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల మూసివేత కారణంగా విద్యార్థులు...