TRSV రాష్ట్ర ఇంచార్జ్‌గా వల్లకొండ అజయ్ రెడ్డి

నవపక్షం, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం (TRSV) రాష్ట్ర ఇంచార్జ్‌గా వల్లకొండ అజయ్ రెడ్డిని నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలకు సంబంధించిన విద్యార్థి విభాగ కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసే బాధ్యతలను అజయ్ రెడ్డికి అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వల్లకొండ అజయ్ రెడ్డి మాట్లాడుతూ, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వాటిని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లేందుకు...