శాలిగౌరారం డిప్యూటీ తహసీల్దార్‌గా మొగిలి విజయ్ శేఖర్
నవపక్షం , శాలిగౌరారం మండల ప్రతినిధి : శాలిగౌరారం మండల నూతన డిప్యూటీ తహసీల్దార్‌గా (డీటీ) మొగిలి విజయ్ శేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో చేరి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. మొగిలి విజయ్ శేఖర్ గతంలో నేరేడుగొమ్ము తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. అక్కడ తనకు అప్పగించిన రెవెన్యూ బాధ్యతలను నిర్వహించిన అనంతరం ప్రస్తుతం డిప్యూటేషన్‌పై శాలిగౌరారం మండల డిప్యూటీ తహసీల్దార్‌గా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ సిబ్బంది నూతన డిప్యూటీ...