బాచుపల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి సుబ్బారావు నియామకం
నవపక్షం, బాచుపల్లి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ 274 బాచుపల్లి డివిజన్ అధ్యక్షురాలిగా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావును నియమించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి ఈ నియామకాన్ని ప్రకటించారు. విజయలక్ష్మి సుబ్బారావు నియామకం పట్ల జిల్లా, నిజాంపేట్ సర్కిల్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి 274 బాచుపల్లి...