కోటలో ఘనంగా ప్రపంచ శాంతి దినోత్సవం.. శాంతి సందేశంతో విద్యార్థుల ర్యాలీ

నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోటలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యానగర్ లోని ఫోనిక్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు శాంతి ర్యాలీ నిర్వహించారు.మండల కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీలో విద్యార్థులు శాంతి,సోదరభావం, సహనానికి సంబంధించిన సందేశాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ శాంతి మార్గంలో పయనించాలని, యుద్ధాలు,హింసకు తావులేకుండా పరస్పర స్నేహభావం,సహనం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. భవిష్యత్ తరాలకు ప్రశాంతమైన, సురక్షితమైన సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి...