శాలిగౌరారం మార్కెట్ సెంటర్‌లో హెచ్ఐవి–ఎయిడ్స్‌పై కళాజాతర అవగాహన కార్యక్రమం

నవపక్షం, శాలిగౌరారం మండల ప్రతినిధి : శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ సెంటర్‌లో హెచ్ఐవి–ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో, జిల్లా ఆరోగ్యశాఖ అదనపు అధికారి డాక్టర్ శంకర్ గారి పర్యవేక్షణలో, డీపీఎంఓ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నల్లగొండకు చెందిన శ్రీ సాయి ఆర్ట్స్ అకాడమీ కళాకారులు కళాజాతర ద్వారా హెచ్ఐవి–ఎయిడ్స్ వ్యాప్తి, నివారణ చర్యలు, అపోహల నివృత్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళా ప్రదర్శన ద్వారా...