రసూల్‌పూర్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి: మండలంలోని రసూల్‌పూర్ గ్రామంలో శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మాజీ ఉపసర్పంచ్ గుండెబోయిన సైదులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా భక్తులు చప్పట్లు కొడుతూ భజనలు చేస్తూ వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, భజన కార్యక్రమాలతో ఉత్సవాలను రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో రసూల్‌పూర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.