మోదీ సేవా స్ఫూర్తితో విద్యార్థుల ప్రతిభకు గునుపూడి హరిబాబు ప్రోత్సాహం
నవపక్షం, గూడూర్ ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ – వికసిత్ భారత్ మన సంకల్పం కార్యక్రమంలో భాగంగా కోట మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కోట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఏవీకేఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. బీజేపీ కోట మండల అధ్యక్షుడు గునుపూడి హరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా...