లంచాలు లేకుండా అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి: పనాబాక కోటేశ్వరరావు
నవపక్షం, గుడూరు ప్రతినిధి : చిన్నకారు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనాబాక కోటేశ్వరరావు ఆరోపించారు. కోటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూహక్కుల బదిలీ, పట్టాదారు పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అర్హులైన రైతులకు సకాలంలో సేవలు అందడం లేదని అన్నారు. దీనివల్ల రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలను పొందలేక ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు....