సోమశిల హిల్ కాలనీ ఆశా కార్యకర్త పోస్టును మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి
నవపక్షం, గూడూరు ప్రతినిధి : అనంతసాగరం మండలం బొమ్మవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సోమశిల గ్రామ ఆరోగ్య ఉపకేంద్రంలో ఖాళీగా ఉన్న హిల్ కాలనీ ఆశా కార్యకర్త పోస్టును నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని సోమశిల గ్రామానికి చెందిన చాపల మణికంఠ జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన అర్జీలో ఆయన మాట్లాడుతూ.. ఆశా కార్యకర్త పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతలు, స్థానికత, ఇతర అర్హతలు, మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా...