చంద్రశేఖరపురం వీధుల్లో ఇక వెలుగులే వెలుగులు
నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామంలో వీధిలైట్ల సమస్యకు పరిష్కారం లభించింది. గ్రామంలోని 120 విద్యుత్ స్తంభాలకు కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామ వీధులు వెలుగులతో కళకళలాడుతున్నాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే డా. పాశిం సునీల్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో వీధిలైట్లు లేక రాత్రివేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి, షేక్ అక్బర్ బాష, షేక్ మస్తాన్ బాషలు గూడూరు ఎమ్మెల్యే,...