బంగార్పల్లి ఎస్సీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు – పర్యావరణ హితంగా మట్టి వినాయక ప్రతిష్ట
నవపక్షం, జుక్కల్ ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం, బంగార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీలో చిన్న పిల్లలు ఆత్మీయతతో, ఐక్యతతో వినాయక చవితి వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఇక్కడ బంగార్పల్లి ఎస్సీ కాలనీలో చిన్న పిల్లలు మొదటిసారిగా తమ సొంతంగా పర్యావరణానికి ఎంతో మేలు చేసే మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్టించి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొని మట్టి గణపతిని ప్రతిష్టించిన చిన్న పిల్లలు ప్రశాంత్, చరణ్, కృష్ణ, సంజన, లక్కీ, జ్ఞానేశ్వర్, సాత్విక్ తదితరులు ఎంతో ఉత్సాహంగా...