కొండభీమనపల్లిలో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

నవపక్షం, దేవరకొండ ప్రతినిధి : మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అప్పనాల తిరుమల్, వనమాల దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పగిళ్ల చంద్రంతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొంది.