పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలేంటి.. తనిఖీలు ఎక్కడ?

నవపక్షం, నల్లగొండ జిల్లా బ్యూరో : పెట్రోల్, డీజిల్ కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో వాహనదారులు పెట్రోల్ బంకులను ఆశ్రయిస్తుంటారు. ఇంధనం విక్రయించడంతో పాటు వినియోగదారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నాణ్యత, పరిమాణం, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సక్రమంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు అందుతున్న సదుపాయాలు, నిబంధనల అమలుపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. వాష్‌రూమ్.. తాగునీరు.. ఉచిత గాలి పెట్రోల్ బంకులకు వచ్చే వినియోగదారులకు వాష్‌రూమ్, తాగునీరు, వాహనాలకు గాలి...