వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు వెల్లడించాలి: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

  నవపక్షం, చౌటుప్పల్, సెప్టెంబర్ 23: వ్యవసాయానికి వాస్తవంగా ఎన్ని గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారో లాగ్‌బుక్‌లో నమోదైన వివరాలను వెల్లడించాలని విద్యుత్ శాఖ అధికారులను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కోరారు. రైతులకు అందుతున్న విద్యుత్ సరఫరాకు సంబంధించిన లాగ్‌బుక్ వివరాలను చూపించాలని ఆయన అధికారులను కోరినప్పటికీ, అధికారులు వెంటనే స్పష్టమైన వివరాలు వెల్లడించలేదని తెలిపారు. సరఫరా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తామని అధికారులు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులకు న్యాయమైన విద్యుత్ సరఫరా అందడం లేదని, నిర్ణయించిన సమయాల్లో కూడా విద్యుత్ సరఫరా...