ఘనంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు

నవపక్షం, కేతేపల్లి మండల ప్రతినిధి:  గుడివాడ గ్రామంలోని తూర్పుగూడెం కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయకుడికి కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పుగూడెం కాలనీలో సుందరంగా గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూలమాలలు సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వినాయకుడికి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు గద్దపాటి మహేష్ పాల్గొని...