కలెక్టర్ సారూ.. మా గోడు పట్టదా? కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇంట్లో పేద మహిళల ప్రాణాలు అరచేతిలో

నవపక్షం, శాలిగౌరారం ప్రతినిధి : ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇల్లు, నేడు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఇంట్లో పేద మహిళలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. వర్షం పడితే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడడంతో చివరకు గ్రామంలోని పీర్ల కొట్టంలో తలదాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తమ దీనస్థితిని అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఇటుకులహాడ్ గ్రామానికి చెందిన గండెల వెంకమ్మ, రేపని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పైకప్పు పూర్తిగా దెబ్బతినడంతో వర్షం వచ్చిన ప్రతిసారీ నీరు ఇంట్లోకి చేరుతోందని...