కోటేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి
నవపక్షం, గూడూరు ప్రతినిధి : కోట మండలం కోట పట్టణంలో బుధవారం స్వర్గస్తులైన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కోటేశ్వరరావు మాతృమూర్తి తిరుమలశెట్టి ఆదిలక్ష్మమ్మ భౌతికకాయాన్ని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆదిలక్ష్మమ్మ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆత్మీయురాలిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ,ఈ విషాద సమయంలో తాను,పార్టీ శ్రేణులు కుటుంబానికి అండగా...