రసూల్‌పూర్‌లో ఘనంగా విఘ్నేశ్వరుడి నిమజ్జనం

నవపక్షం, నల్గొండ మండల ప్రతినిధి :  నల్గొండ మండలం రసూల్‌పూర్ గ్రామంలో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశ్ నవరాత్రి ఉత్సవాలు బుధవారం విఘ్నేశ్వరుడి నిమజ్జనంతో ఘనంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోలి సైదులు, మాజీ ఉప సర్పంచ్ గుండెబోయిన సైదులు, ఐతం సైదులు, పద్మారెడ్డి తదితరులతో పాటు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు భక్తిగీతాలు, నినాదాలతో ఉత్సాహంగా పాల్గొని...