భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనం
నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి: మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ లక్కీ డ్రాలో పూజారి ఉప్పల యశ్వంత్ శర్మ విజేతగా నిలిచారు. సీనియర్ న్యాయవాది నక్క రవీందర్ లక్కీ డ్రా తీయగా, లడ్డూను యశ్వంత్ శర్మకు అందజేశారు. కలశాన్ని గుర్రం బిక్షమయ్య, పైసల దండను...