ఉత్తమ ఉపాధ్యాయుడిగా నక్క యుగంధర్

  నవపక్షం, నాంపల్లి ప్రతినిధి :  మండలంలోని పస్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నక్క యుగంధర్ నల్గొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో చేసిన విశేష సేవలను గుర్తించి విద్యాశాఖ ఆయనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా యుగంధర్ అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా...