నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ
నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి : నరసింహస్వామి చేనేత సహకార సంఘం 32వ సాధారణ మహాసభ గురువారం నాంపల్లిలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షురాలు నక్క యాదమ్మ సహకార పతాకాన్ని ఆవిష్కరించి సభకు అధ్యక్షత వహించారు. నాంపల్లి గ్రామ సర్పంచ్ నక్క చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంఘం మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ నక్క రవీందర్ సభను ప్రారంభించి మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సభ్యులంతా ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి సభ్యుల...