లక్కీ డ్రాలో లడ్డూ దక్కించుకున్న పూజారి యశ్వంత్ శర్మ

నవపక్షం, నాంపల్లి మండల ప్రతినిధి :  నాంపల్లి మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి లడ్డూ ప్రసాదానికి లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రాను సీనియర్ న్యాయవాది నక్క రవీందర్ తీశారు. లక్కీ డ్రాలో నాంపల్లి పూజారి ఉప్పల యశ్వంత్ శర్మ లడ్డూ ప్రసాదాన్ని గెలుపొందారు. అనంతరం సీనియర్ న్యాయవాది నక్క రవీందర్ లడ్డూను యశ్వంత్ శర్మకు అందజేశారు. అదేవిధంగా కలశాన్ని గుర్రం బిక్షమయ్య, పైసల దండను సంగెపు రాము వేలం ద్వారా...